“భీమ్లా నాయక్” ను నువ్వు ఏమి చేయలేవు : జగన్ కు జేసీ సవాల్

-

అనంతపురం : బీమ్లా నాయక్ ని నువ్వు ఏమి చేయలేవని ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ విసిరారు. ఇవాళ “బీమ్లా నాయక్” మూవీ విడుదల పై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ సినిమాల పై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు.

పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేశారు.. అయినా ఆయనకు ఏమీ కాదని చురకలు అంటించారు. ఈ గో నీకు ఒక్కడికే కాదు అందరికీ ఉంది.. పవన్ కల్యాణ్ కీ ఉంటుందని ఫైర్ అయ్యారు. నన్ను కేసుల్లో ఇరికించావ్.. ఏం చేశావ్.. నువ్ ఏమీ చేయలేవు అని హెచ్చరించారు.

చిరంజీవి చేతులు జోడించి అడుగారు.. ఆయన బతకలేక నీ దగ్గరకు రాలేదు.. సినిమా పరిశ్రమ కోసం వచ్చారని చెప్పారు. ఇక నుంచి ఏ హీరో, డైరెక్టర్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సినిమా తీయరని వెల్లడించారు. సినిమా టికెట్ల ధరల తగ్గింపుకు మేము వ్యతిరేకం కాదు.. కానీ ముందే చెప్పాలి కదా ? అని నిప్పులు చెరిగారు. అదే ఎవడబ్బ సొమ్మని తిరుమలలో టికెట్ల ధరలు పెంచుతున్నారని ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news