BRS పార్టీలో చేరడంపై జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. నేను విశాఖ నుండి పోటీకి దిగుతున్నానని…మీడియావారు రోజుకో పార్టీలో నన్ను చేర్చుతున్నారన్నారు జేడీ లక్ష్మీనారాయణ. బీఆర్ఎస్ నుండి పోటీ అనే ప్రచారం కేవలం ప్రచారం మాత్రమేనని..ఎన్నికల సమయానికి నా భావాలకు అనుగుణంగా ఉన్న పార్టీ నుండి పోటీ చేస్తానని వెల్లడించారు.
విశాఖ రాజధాని మార్పు అనేది సుప్రీం కోర్ట్ లో ఉందని…కోర్ట్ లో ఉన్నప్పుడు ఇష్టానుసార ప్రకటనలు చెల్లవని తెలిపారు. అలా చేస్తే కంటెప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకు వస్తుందని..ఫోన్ ట్యాపింగ్ అంశంలో బాధితుడి ఆరోపణలపై న్యాయస్థానాలను, మానవహక్కులను, పోలీసులను ఆశ్రయించవచ్చని వెల్లడించారు జేడీ లక్ష్మీనారాయణ. ఫోన్ ట్యాపింగ్ అంశానికి చట్టబద్దత ఉంది, నిరాదార ఆరోపణలు పని చేయవని…దేశమంతటా రైతులకు ప్రాధాన్యత ఉంది, రాష్ట్రాలు కూడా రైతులకు ప్రధాన్యత ఇవ్వాలని కోరారు జేడీ లక్ష్మీనారాయణ.