ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చించాలని నిర్ణయం తీసుకున్నాయి. కాగ కాసేపటి క్రితం పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్ కమిటీ సమావేశం అయి.. ప్రభుత్వంతో చర్చలకు వెళ్లలా.. వద్ద అనే అంశంపై చర్చించాయి. ఈ సమావేశంలో పీఆర్సీ పై ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చించాలని స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చించడానికి సచివాలయానికి చేరుకున్నారు.
అలాగే కాసేపటి క్రితం పలువురు మంత్రులు కూడా ముఖ్య మంత్రి జగన్ తో సమావేశం అయ్యారు. సీఎం జగన్ తో సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో పాటు ఉద్యోగ సంఘాలతో చర్చించడానికి ప్రత్యేకంగా నియమించిన కమిటీ ఉద్యోగులతో చర్చించడానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పరిపాలన కేంద్రం అయిన సచివాలయానికి చేరుకున్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చించడానికి రాష్ట్ర మంత్రి బొత్స సత్య నారాయణ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల కూడా ఉన్నారు. అయితే రేపటి నుంచి రాష్ట్రంలో ఉద్యోగులు సహాయ నిరాకరణ చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ఆసక్తి రేపుతున్నాయి.