పవన్ కళ్యాణ్ రాజకీయాలనుంచి తప్పుకోవాల్సిందే – KA paul

-

పవన్ కళ్యాణ్ రాజకీయాలనుంచి తప్పుకోవాల్సిందేనని KA paul పేర్కొన్నారు. ఇప్పటికే చంద్రబాబు, జగన్, మోడీ ని చూశారు. పవన్ సీఎం అవ్వనని చెప్పారు. ఆయనే ఫెయిలుర్ నాయకుడు అనిచెప్పాడని చురకలు అంటించారు పాల్. ఎందుకు ఓటు వేస్ట్ చేస్తారు. డబ్బుల కోసం తోట చంద్రశేఖర్ వంటి వారు బీ అర్ ఎస్ లో చేరారని ఫైర్ అయ్యారు.

పవన్ తమ్ముడు రాజకీయాలు అయినా మానుకోవాలని కోరారు. నాకు మద్దతు అయినా ప్రకటించు అని కోరారు. మోసం చేసిన బీజీపీతో మళ్లీ పవన్ జత కట్టాడని మండిపడ్డారు. సంక్రాంతి రోజు డబ్బు లేక రాయలసీమ లో చాలామంది పండుగ చేసుకోలేక పోతున్నారు.. పాలకులు ఏం చేస్తున్నారన్నారు. ఈ ఏడాది రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి… అందరూ ఆలోచించండి. వచ్చే ఐదేళ్ల లో దేశ, రాష్ట్ర ప్రజలకు నా ద్వారా మంచి జరుగుతుంది అని ఆశిస్తున్నానని తెలిపారు. కియా వస్తే ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తాం అన్నారు చంద్రబాబు ఏమైందని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news