క్యాసినో కాక: గుడివాడలో ‘తమ్ముళ్ళు’ వర్సెస్ ‘ఫ్యాన్స్’..

-

గుడివాడ రాజకీయాల్లో క్యాసినో కాక ఇంకా తగ్గలేదు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కె కన్వెషన్ సెంటర్‌లో గోవా తరహాలో క్యాసినో నిర్వహించారనే అంశంపై ప్రతిపక్ష టీడీపీ నేతలు ఫైర్ అవుతున్న విషయం తెలిసిందే. విదేశీ సంస్కృతి తీసుకొచ్చి గుడివాడని కొడాలి భ్రష్టు పట్టించారని తెలుగు తమ్ముళ్ళు విమర్శలు చేస్తున్నారు. అలాగే క్యాసినోకు సంబంధించిన పలు వీడియోలు, ఫోటోలని సోషల్ మీడియాలో పెట్టారు.

kodali-nani

అయితే దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు…ఇక క్యాసినో నిర్వహణపై పోలీసులు కూడా విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. కాకపోతే పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నిజనిర్ధారణ పేరిట కమిటీ ఏర్పడి..గుడివాడకు వెళ్లింది. నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజా, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, కొనకళ్ళ నారాయణ, గుడివాడ టీడీపీ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు..ఈ కమిటీలో ఉన్నారు. తాజాగా ఈ కమిటీ గుడివాడ టీడీపీ ఆఫీసులో సమావేశమై..కన్వెషన్ సెంటర్‌కు వెళ్లడానికి ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకుని టీడీపీ నేతలని అరెస్ట్ చేశారు.

దీంతో గుడివాడలో టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి… ఇదే క్రమంలో కన్వెషన్ సెంటర్‌లో వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా సమావేశమై.. వాళ్ళు కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. దీంతో తమ్ముళ్ళు, వైసీపీ ఫ్యాన్స్ మధ్య రచ్చ తీవ్రమైంది. అయితే టీడీపీ నేతలు కావాలనే కొడాలిని నెగిటివ్ చేయడానికి ఇలా చేస్తున్నారని వైసీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నాయి.

పండగ సమయంలో జరిగిన దానికి ఇప్పుడు వచ్చి ఏం చేస్తారని చెప్పి కొందరు వైసీపీ నాయకులు బహిరంగంగానే ఫైర్ అవుతున్నారు. కొడాలిని ఎంత నెగిటివ్ చేయాలనుకున్న అది సాధ్యం కాదని, గుడివాడ ప్రజలు కొడాలి వైపే ఉంటారని అంటున్నారు. మొత్తానికైతే క్యాసినో వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news