జూనియర్ NTR ను తొక్కేస్తున్నారు – కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ కి అడ్డు వస్తారని భయంతో జూనియర్ ఎన్టీఆర్ ని తొక్కిస్తున్నారని ఆరోపించారు. ఏపీని ఆక్రమించాలని ఒక కులం పన్నాగాలు పన్నుతోందని.. ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా టిడిపి కుట్రలు చేస్తోందన్నారు. లోకేష్ నీ ప్రజలపై రుద్ది.. ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా టిడిపి చేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.

ఎన్టీ రామారావు, వైయస్సార్ కలిస్తే ఉండేంత దమ్ము కేవలం సీఎం జగన్ కు మాత్రమే ఉందని.. అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఏపీ ప్రజలకు ఉందన్నారు. మరోవైపు తనను మంత్రివర్గం నుంచి తొలగించడం పై జరుగుతున్న చర్చ పై స్పందించారు. తనని కాదని పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే జోగి రమేష్ ను మంత్రిని చేయడంపై ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు కొడాలి జవాబు ఇచ్చారు. జోగి రమేష్ మంత్రి అయితే తాను, పేర్ని నాని, వంశీ మంత్రులు అయినట్లేనని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news