చంద్రబాబును ఆ కార్డుతోనే కొట్టిన కొడాలి నాని… సంచలన వ్యాఖ్యలు!

బీసీ కార్డు తన పేటెంట్ అన్నట్లుగా మాట్లాడుతుంటుంటారు చంద్రబాబు అనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. అదే కార్డును తనదైన శైలిలో బయటకు తీశారు ఏపీ మంత్రి కొడాలి నాని! ఇదే సమయంలో మోకా భాస్కర్ రావు హత్యకేసులో బాబుపై కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు.. సంచలన వ్యాఖ్యలు చేశారు!


వివరాళ్లోకి వెళ్తే… మోకా భాస్కర్ రావు హత్యకేసులో కొల్లు రవీంద్ర పాత్రతోపాటుగా దేవినేని ఉమా, చంద్రబాబుల హస్తం కూడా ఉండి ఉంటుందని నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. మంత్రిస్థానంలో ఉన్న నాని ఇలాంటి కామెంట్లు చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది! వైసీపీలో పేర్నినానికి ప్రధాన అనుచరుడిగా ఉన్న మోకా.. మచిలీపట్నంలో కీలక నేతగా ఎదుగుతున్న ఎదుగుదలను చూసి రవీంద్ర, నాంచారయ్య తట్టుకోలేకపోయారని,. అందుకే మోకాను అడ్డు తొలగించుకోవాలని హత్యారాజకీయాలకు తెరతీశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతరం naaని కూడా బీసీ కార్డు బయటకు తీశారు.

టీడీపీ నేతలు ఎవరిని అరెస్టు చేసినా వెంటనే కులం కార్డ్ తీస్తున్నారు చంద్రబాబు. ఆయనతో పాటు మిగిలిన టీడీపీ నేతలు కూడా మైకుల ముందుకొచ్చి బీసీ కార్డు బయటకు తీస్తున్నారు. ఈ క్రమంలో కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడులు మాత్రమే బీసీలు కాదన్నట్లుగా మొదలెట్టిన కొడాలి నాని … తమ పార్టీలోని బలహీన వర్గాలకు చెందిన మోకా వంటి నాయకులని చంపించి.. వైసీపీని బలహీనపరచాలన్న కుట్రను టీడీపీ నేతలు పన్నారని అన్నారు.

దీంతో.. బాబు రెగ్యులర్ గా వాడే బీసీ కార్డునే నాని కూడా తిరిగి బాబుపై ప్రయోగించినట్లయ్యిందని కామెంట్లు వస్తున్నాయి. దీంతో ఇక రవీంద్ర విషయంలో.. బీసీ కార్డును టీడీపీ నేతలు వాడే అవకాశం లేకుండా చేశారనే కామెంట్లూ వినిపిస్తున్నాయి!!