గుడివాడలో ఐదోసారి గెలిచి చరిత్ర సృష్టిస్తా – కొడాలి నాని

-

గుడివాడలో పోటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని. నేడు గుడివాడ ఆర్టీసీ డిపో గ్యారేజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన కొడాలి నాని మాట్లాడుతూ.. గుడివాడలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని.. ఐదవ సారి గెలిచి చరిత్ర సృష్టిస్తారని అన్నారు. దాంతో చరిత్రలో మన పేరు నిలిచిపోతుందని అన్నారు కొడాలి నాని. కానీ కొందరు సెంటిమెంట్.. అది ఇది అని అంటున్నారని.. అయినప్పటికీ గెలిచేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తానని అన్నారు.

మాటిమాటికి గుడివాడ నాదే అని చంద్రబాబు సిగ్గు లేకుండా చెబుతున్నాడని మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గుడివాడలో ఫ్లైఓవర్ ఎందుకు కట్టలేదని మండిపడ్డారు. ఏ విషయం పరంగా చూసినా జగన్ కి చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news