కొత్త సచివాలయంలో కొలువుదీరిన మంత్రులు

-

తెలంగాణ ప్రభుత్వం భారీ ఖర్చుతో, అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ లాంచనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి నూతన సచివాలయం సముదాయంలో అడుగు పెట్టారు. అనంతరం ఆరో అంతస్తులోని సీఎం కార్యాలయానికి వెళ్లిన ముఖ్యమంత్రి సుముహూర్త సమయంలో కుర్చీలో ఆశీనులయ్యారు. ఆ తర్వాత మంత్రులు తమ ఛాంబర్లలో అశీనులయ్యారు. సంబంధిత ఫైళ్లపై తొలి సంతకాలు చేశారు.

మూడో అంతస్తులో మంత్రి కేటీఆర్ కి కేటాయించిన తన కార్యాలయం నుంచి విధులు నిర్వర్తించనున్నారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా హైదరాబాద్ లో జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులకు సంబంధించిన మార్గదర్శకాల పంపిణీ పై కేటీఆర్ తొలి సంతకం చేశారు. హైదరాబాద్ లో లక్ష మంది పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయనున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ట్యాబ్ ల పంపిణీ పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంతకం చేశారు. అలాగే ప్రధాన దేవాలయాలలో మిల్లెట్లతో కూడిన ప్రసాదం అందుబాటులోకి తెచ్చే ఫైల్ పై సంతకం చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news