సభలో రాజకీయాలు చేయను… బయట మాత్రం రాజకీయ నాయకుడిగానే ఉంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి. డిప్యూటీ స్పీకర్ గా ప్రమాణం చేసిన అనంతరం కోలగట్ల వీరభద్రస్వామి.. మాట్లాడుతూ.. నా పేరును ఉప సభాపతిగా అయిదు నెలల ముందే ఎంపిక చేశారన్నారు. శాసన సభ సమావేశాలు జరగక పోవటంతో ఎన్నిక ఇప్పుడు జరిగింది… సభా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రజలు టీవీలు, ఇతర మాధ్యమాల ద్వారా చూస్తూనే ఉంటారని తెలిపారు.
సభా గౌరవాన్ని పెంచేలా సభ్యులు వ్యవహరించాలి.. రూల్స్ కు విరుద్దంగా వ్యవహరించే వారు ప్రజలు తమను గమనిస్తున్నారు అనే విషయాన్ని గుర్తించుకోవాలని కోరారు. సభ్యుల తమ సహకారాన్ని అందిస్తారని భావిస్తున్నాను.. సభ మర్యాదను, హుందాతనాన్ని, గౌరవాన్ని కాపాడడానికి నాశాయశక్తుల ప్రయత్నం చేస్తానన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవి వల్ల ఆర్య వైశ్య సామాజిక వర్గానికి, విజయనగర జిల్లా ప్రజలకు ఈ గౌరవం దక్కిందని భావిస్తున్నా.. ఈ స్థానానికి వైసీపీ నుంచి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యాక వచ్చానన్నారు కోలగట్ల వీరభద్రస్వామి.