తిరుమలలో నిఘా నిద్రపోతుంది. నిఘా అధికారుల వైఫల్యం మరోసారి బట్టబయలైంది. తిరుమల కొండపై మద్యం బాటిల్లు పట్టుబడి కలకలం రేపింది. శ్రీవారి ఆలయానికి కూతవేటు దూరంలో ఉన్న హెచ్.టి.సి కాంప్లెక్స్ లోని షాప్ నెంబర్ 78 లో ఐదు మద్యం బాటిల్స్ ను టీటీడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షాపులు సీజ్ చేశారు. కాగా తిరుమల లో మద్యం విక్రయాలపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవిత్ర కొండపై ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హెచ్.టి. సి కాంప్లెక్స్ లో వ్యక్తిపై హత్యాయత్నం ఘటన మరువకముందే అదే కాంప్లెక్స్ లో మద్యం సీసాలు పట్టుబడడం కలకలం సృష్టిస్తుంది.