పార్లమెంటును ప్రారంభించాల్సింది ప్రధాని కాదు.. రాష్ట్రపతి – రాహుల్ గాంధీ

-

ఈనెల 28వ తేదీన నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. అయితే నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సింది ప్రధాని మోదీ కాదని.. రాష్ట్రపతి అని ట్విట్ చేశారు. మరోవైపు పలువురు ప్రతిపక్ష నేతలు సైతం అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రధాని మోదీ ప్రభుత్వానికి అధిపతి అని, శాసనసభకు అధిపతి కాదని పేర్కొన్నారు. వీర్ సవర్కర్ జయంతి రోజున కొత్త పార్లమెంటుకు ప్రారంభించడం ఏమిటని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ఇటీవల ట్వీట్ చేశారు. ఇక లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోదీని కలిసి కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news