అసెంబ్లీ తీర్మానం, కేంద్రానికి లేఖ‌లు ఫేక్ అని తేలిపోయాయి

-

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణపై కేంద్రం మరో ముందడుగు వేసిన విషయం తెల్సిందే. కన్సల్టెంట్‌ నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేయడంతో పాటు ప్లాంట్‌తో పాటు అనుబంధ సంస్థలన్నీ అమ్ముతామని కేంద్రం పేర్కొంది. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్‌ప్లాంట్ వద్ద ఉద్యోగులు ఆందోళనలు తీవ్రతరం చేసారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు, కార్మికులు ధర్నా చేస్తున్నారు.

అయితే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణపై మరో కేంద్రం ముందడుగు వేయడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.. ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ వ‌ద్దంటూ చేసిన తీర్మానం, దీనికి సంబంధించిన కేంద్రానికి రాసిన లేఖ‌లు ఫేక్ అని తేలిపోయాయని ఆరోపించారు. ఇప్ప‌టికైనా ఢిల్లీ వెళ్లి ప్రైవేటీక‌ర‌ణ‌ని ఆపే ప్ర‌య‌త్నాలు చేయాలని హితవు పలికారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ జరిగితే ప‌దుల సంఖ్య‌లో ఉద్య‌మ‌కారుల ప్రాణ‌త్యాగాల‌తో ఏర్ప‌డిన విశాఖ ఉక్కుని ప్రైవేట్ ప‌రం చేయ‌డానికి స‌హ‌క‌రించిన రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా చ‌రిత్ర‌హీనులుగా మిగిలిపోతారని లోకేష్ ట్వీట్ చేసారు. వైసీపీ ఎంపీలను కేసుల మాఫీ లాబీయింగ్ కోసం కాకుండా, ఏపీ ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణ‌కి పోరాడాల‌ని ఆదేశాలివ్వాలని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version