పల్నాడు ప్రమాద ఘటన బాధితులను పరామర్శించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి

-

పల్నాడు జిల్లా రెంటచింతల లో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రమాద ఘటన బాధితులను పరామర్శించారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. బాధితులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే. ప్రమాదాలకు కారణమైన ఓవర్ లోడింగ్, రాంగ్ పార్కింగ్ పై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిర్లక్ష్యంతో అమాయక ప్రజల ప్రాణాలు పోతున్న పరిస్థితి బాధ కలిగిస్తోందన్నారు పిన్నెల్లి.

రెంటచింతల కు చెందిన 38 మంది టాటా ఏస్ వాహనంలో శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుని తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెంటచింతల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో వాహనంలో ఉన్న వారు ఎగిరి రోడ్డు మీద పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news