రెబల్ ఎంపీ కలిసిన ఢిల్లీ పెద్దలనే కలిసిన మరో ఎంపీ… వైకాపాలో ఏమి జరుగుతుంది?

ఏపీలో చాలా పరిణామాలు జరిగిన అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు రఘురామకృష్ణంరాజు రాజు.. అనంతరం కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి, సదానంద్ గౌడ్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాలతో భేటీ అయ్యారు. తనకు రక్షణ కల్పించమని రాజ్ నాథ్ సింగ్ ని.. తనకు అన్యాయం జరిగిందని మిగిలిన కేంద్రమంత్రులను.. మిగిలిన తన ఎంపీ హక్కులపై ఓం బిర్లాను రఘురామ కృష్ణం రాజు కలిశారని కథనాలు వచ్చాయి. ఆ సంగతులు అలా ఉంటే… సరిగ్గా రఘురామకృష్ణంరాజు కలిసిన కేంద్రమంత్రులు, స్పీకర్ నే తాజాగా మరో వైకాపా ఎంపీ కలిశారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజాకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది!

అవును.. మచిలీపట్నం వైకాపా ఎంపీ వల్లభనేని బాలశౌరి తాజాగా ఢిల్లీలో కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, ప్రహ్లాద్ జోషి, సదానంద్ గౌడ్, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాలతో భేటీ అయ్యారు. సరిగ్గా వీరిని కూడా రెండు రోజుల ముందు వైకాపా రెబల్ ఎంపీ ఆర్.ఆర్.ఆర్. కలవడంతో… జగన్ తన దూతగా బాలశురీని పంపారని అంతా భావిస్తున్నారు. రఘురామకృష్ణంరాజు చేసిన ఫిర్యాదులపై వివరణ ఇచ్చేందుకే బాలశౌరీని జగన్ పంపారని, అందుకే బాలశురి ఢిల్లీ పెద్దలను కలిశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో… నరసాపురం త్రిబుల్ ఆర్ కు జగన్ చెక్ పెట్ట నిర్ణయించుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయాలపై బాలశౌరి స్పందించారు. రఘురామకృష్ణం రాజు భేటీలకు, తన సమావేశాలకూ సంబంధమే లేదని చెబుతున్నారు. తన నియోజకవర్గంలో రూ. 3వేల కోట్ల కేంద్రప్రభుత్వ నిధులతో చేపడుతున్న క్షిపణి పరీక్షా కేంద్రం శంకుస్థాపనకు రావాలని కోరడానికే వెళ్లానని చెబుతున్నారు. జగన్ ఆదేశాల మేరకు క్యాప్టివ్ మైన్స్ ను కేటాయించేలా చూడమని కోరడానికి బొగ్గు గనుల శాఖామంత్రి ప్రహ్లాద్ జోషీని.. ఫార్మా పార్కును కేటాయించాలని ఎరువులు, రసాయనాల శాఖా మంత్రి సదానంద్ గౌడ్ ను కలిశానని.. వర్షాకాల సమావేశాలు ఎప్పుడు పెడతారో కనుక్కోవడానికి స్పీకర్ ను కలిశానని చెబుతున్నారు బాలశౌరి!

వినడానికి కాస్త క్లారిటీగానే ఉన్నా… ఎక్కడో కొడుతుంది రాజా అని పలువురు ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. నాలుగు రోజులు అయితే అన్నీ వెలుగులోకి వస్తాయని మరికొందరు ఆశాజీవులు చెబుతున్నారు.