పవన్ లాంటి సినిమా వాళ్ల దగ్గరే రూ. 2 వేల నోట్లు ఉంటాయని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. రూ. 2 వేల నోట్ల రద్దు వల్ల నాకు కానీ మా పార్టీకి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు…నేను, మా పార్టీ పేదల పక్షం అని తెలిపారు. ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడం ద్వారానే మేం ఎన్నికల్లో గెలుస్తాం.. డబ్బులతో కాదు… ఎన్నికల్లో డబ్బు పంపిణీని పరిచయం చేసింది చంద్రబాబేనని తెలిపారు.
ఎన్నికల్లో ఓట్లతో గెలవాలనుకున్న చంద్రబాబుకే రూ. 2 వేల నోట్ రద్దు వల్ల ఇబ్బంది…చివరి నిమిషంలో రాజకీయాల్లోకి వచ్చి.. డబ్బుల పంపిణీతో రాజకీయం చేద్దామనుకునే వాళ్లకు కచ్చితంగా ఇబ్బంది ఉంటుందని వివరించారు. గంటకు కోట్లాది రూపాయలు తీసుకునే పవన్ లాంటి సినిమా వాళ్ల దగ్గరే పెద్ద నోట్లు ఉంటాయి…పేదలు స్వేదం చిందించి సంపాదించిన డబ్బు పవన్ వంటి వాళ్ల దగ్గరే ఉంటుందని పేర్కొన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. జగన్ పై ఇష్టం వచ్చినట్టు క్యారికేచర్లు వేయడం సరికాదు…రాజకీయ నేతల దగ్గరే డబ్బులు ఉంటాయనే భావన కూడా సరైంది కాదని పేర్కొన్నారు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు.