సస్పెన్షన్ వల్ల.. రిలాక్స్‌గా ఫీల్ అవుతున్నా – మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

సస్పెన్షన్ వల్ల.. రిలాక్స్‌గా ఫీల్ అవుతున్నానని వైసీపీ పార్టీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలపై వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి స్పందించారు. నేను పార్టీ చెప్పిన ప్రకారం వెంకర రమణ కే ఓటు వేశానని.. ఆయన గెలిచారు…నన్ను ఎవరూ అనటానికి లేదని ఫైర్‌ అయ్యారు.

నేను పార్టీకి చేసిన.. ఓటు వేసిన తర్వాత నేను ముఖ్యమంత్రి జగన్ ని కలిసి వచ్చానని వివరించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో చాలా సంతోషంగా ఉన్నానని… మంచి చేసినవారికి కూడా కొందరు చెడు చేస్తారన్నారు. అనుకున్నది చేసేయడం వైసీపీలో అలవాటుగా మారిందని..జగన్‌కు మద్దతిచ్చినందుకు పార్టీలో చాలా మర్యాదలు చేశారని వివరించారు. నా నియోజకవర్గాన్ని భ్రష్టుపట్టించారు, కావాలంటే ఇప్పుడే రాజీనామా చేస్తా.. ఎవరు గెలుస్తారో చూద్దామని.. పార్టీ అగ్రనేతలకు మానవతాభావాలు అవసరమని చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలామందిలో గుసగుసలు మొదలయ్యాయని ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి.