చింతకాయల విజయ్.. సోషల్ మీడియా అరాచకవాదని..టీడీపీ నేతలు తమకు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం వర్తించదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మేరుగ నాగార్జున. పచ్చమీడియా వ్యవహార శైలి కూడా అలాగే ఉందని.. అతను పెట్టే పోస్టులు ఎంతో దారుణంగా ఉన్నాయని ఆగ్రహించారు.
వాటిపై విచారణ చేస్తుంటే అదికూడా తప్పు అనేలాగ చేస్తున్నారు.. అసలు ఎల్లోమీడియా జర్నలిజం చేస్తోందా?అని నిలదీశారు. పోలీసులు విజయ్ ఇంటికి వెళ్తే వీరంతా గగ్గోలు పెడుతున్నారని… సీఐడీ వారు దొంగని పట్టుకోవటానికి వెళ్తే తప్పా ? అని నిలదీశారు. ఒక మహిళ మీద అభ్యంతరకర పోస్టులు పెట్టడాన్ని వీరు సమర్ధిస్తారా? మహిళల మాన, ప్రాణాల గురించి అసభ్యకర పోస్టులు పెట్టాడని మండిపడ్డారు.
ఐటీడిపి అనే దాంట్లో ఈ విజయ్ దారుణమైన పోస్టులు పెట్టారని.. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల ధన, మానాలను దోచుకున్న వ్యక్తులు ఈ టీడీపీ వాళ్లు అన్నారు. అలాంటి వ్యక్తులను ఎల్లోమీడియా ఎందుకు వెనుకేసుకుని వస్తుంది?వీరి అఘాయిత్యాలపై ప్రతిఘటనగా మావాళ్లు ఎవరైనా పోస్టులు పెడితే తట్టుకోలేక పోతున్నారని ఆగ్రహించారు. చింతకాయల విజయ్ చేసే ఘోరమైన ఇతర వ్యాపారాలకు చంద్రబాబు, లోకేష్ లు సమర్ధిస్తున్నారని ఓ రేంజ్ ఫైర్ అయ్యారు.