ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు కంటే ముందే ప్రారంభమైన పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని వ్యాఖ్యానించారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందని అక్కడ ఇంజనీర్ ను అడిగానని.. ఎంత సమయం పడుతుందో తెలియదని ఆ ఇంజనీర్ జవాబు ఇచ్చారని తెలిపారు మంత్రి హరీష్ రావు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టు ఇంకో 5 ఏళ్ళు అయినా పూర్తి అయ్యే పరిస్థితి లేదన్నారు మంత్రి హరీష్ రావు.
ఇక తెలంగాణలో త్వరలో మరో రెండు వేల పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. గ్రూప్ 4 ఉద్యోగాల నోటిఫికేషన్ త్వరలో వెల్లడిస్తామన్నారు. 95% స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కేటాయిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్మీలో అగ్నిపత్ పథకంతో నాలుగేళ్ల కాంట్రాక్ట్ తో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారని.. ఆ ఉద్యోగాలకు యువత సుమఖం వ్యక్తం చేయడం లేదని విమర్శించారు.