రాజమండ్రిలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పౌరసరఫరాల పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్షించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌర సరఫరాల శాఖ అధికారులు పనితీరు మెరుగు పర్చుకోవాలని.. రేషన్ బియ్యాన్ని సకాలంలో లబ్దిదారులకు అందజేశారు.
గొడౌన్ల నుండి రేషన్ షాపులకు వచ్చే బియ్యంలో కొలతలు తేడా వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎం.డి.యూ. వాహనానికి రెండు వేల కార్డులు మించకుండా ఇస్తామని.. రెండు వేల మించి కార్డు హోల్డర్లు ఉంటే కొత్త వాహనం ఏర్పాటు చేస్తామన్నారు.
ఆర్.బి.కె.ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని.. రైతు ఏవరనేది మిల్లర్లకు తెలియకూడదని పేర్కొన్నారు. బీలో ఇప్పటి వరకు 16 లక్షల టన్నుల ధాన్యం సేకరించామని.. మద్దతు ధర విషయంలో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో సన్న బియ్యం సరఫరా చేస్తున్నారో లేదో సోము వీర్రాజు చెప్పాలని ఫైర్ అయ్యారు.