బిజినెస్‌ ఐడియా: సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా?ఈ ఐడియా మీ కోసమే..

-

ఈరోజుల్లో చాలా మంది ఉద్యోగాలు చేయడం కన్నా, సొంతంగా బిజినెస్ ను స్టార్ట్ చేయాలనీ అనుకుంటారు. అయితే తక్కువ డబ్బులతో ఎటువంటి బిజినెస్‌ ను చేస్తే మంచి లాభాలను పొందువచ్చు అనేది చాలా మందికి అవగాహన లేదు.దాంతో ఏదొక బిజినెస్ చేసి నష్టాలను చూడటం తప్ప మరోకటి ఉండదు. భాధపడకండి.. మీ కోసం చక్కని బిజినెస్ అందుబాటులో ఉంది.. ఈ బిజినెస్ లో నష్టాలు తక్కువ, లాభాలు ఎక్కువ..అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సీజన్‌కు అనుగుణంగా వ్యాపారం చేయడం మంచిది. ఈ రోజుల్లో దేశంలోని చాలా ప్రాంతాలలో తీవ్రమైన వేడి ప్రబలుతున్న ఈ సమయంలో ఈ పరిస్థితిలో మేము మీకు అలాంటి వ్యాపార ఆలోచనలను అందిస్తున్నాం. ఇందులో నష్టాలు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే, లాభం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు చాలా తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అదే.. ఐస్ క్రీమ్ పార్లర్ బిజినెస్. ముఖ్యంగా వేసవి రోజులలో ఈ వ్యపారానికి డిమాండ్ చాలా పెరుగుతుందని తెలుసుకోవాలి..

ఈ బిజినెస్ ను చేయడానికి కేవలం 10 వేల నుంచి 20 వేల వరకు మాత్రమే ఖర్చు అవుతుంది.వ్యాపారం పెరిగే కొద్దీ ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ ఈ వ్యాపారం సాగుతోంది. అయినప్పటికీ.. ఈ వ్యాపారాన్ని ఎక్కడైనా ప్రారంభించడానికి అవకాశం ఉంది. మీరు 300-400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐస్ క్రీమ్ పార్లర్‌ను ప్రారంభింవచవచ్చు. ఇందులో 5-10 మందికి సీటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రకారం మన దేశంలో ప్రతి ఏటా బిలియన్​ కు పైగా ఐస్ క్రీమ్ వ్యాపారం పెరుగుతుంది.

ఇకపోతే ఈ బిజినెస్ కు మీరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ తీసుకోవాలి. ఇది 15 అంకెల రిజిస్ట్రేషన్ నంబర్. మీ స్థలంలో తయారుచేసిన ఆహార పదార్థాలు దాని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ఇది నిర్ధారిస్తుంది. మీరు అమూల్ ఐస్ క్రీమ్ పార్లర్‌ను ఫ్రాంఛైజింగ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇందుకోసం కనీసం 300 చదరపు అడుగుల స్థలం కావాలి.మీ ఐస్ క్రీమ్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు అవ్వాలంటే మీరు తయారు చేసే టెస్ట్ ను బట్టి ఉంటుంది. ఒకసారి క్లిక్ అయితే మాత్రం లాభాలే..లాభాలు..

Read more RELATED
Recommended to you

Latest news