48 గంటల లోపే అకౌంట్ లోకి డబ్బులు : నాదెండ్ల మనోహర్

-

3 ఉచిత గ్యాస్ సిలిండర్లు సూపర్ సిక్స్ లో భాగంగా తొలిఅడుగు. మహిళాసాధికారత లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపావళి రోజున ప్రారంభిస్తాం అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్రంలో అర్హత ఉన్న మహిళలకు మూడు గ్యాస్ కంపెనీల ద్వారా అందిస్తున్నాం. అక్టోబర్ 31న డెలివరీ జరిగేలా చూడాలని సీఎం చెప్పారు. 894.92 రూపాయలు డిబిటిఏ ద్వారా ఏర్పాటు చేస్తున్నం. వచ్చే సంవత్సరం నుంచి బ్లాక్ పీరియడ్ విధానం ఉంటుంది.

సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల లోపే లబ్ధిదారుల అకౌంట్ కే డబ్బులు వచ్చేస్తాయి. గ్రామ వార్డు సచివాలయాల్లో ఒక ఆఫీసు ఏర్పాటు చేసి ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తాం. ఈ అక్టోబర్ నుంచీ మార్చి వరకూ మొదటి సిలిండర్ వస్తుంది. ఇక ప్రతి ఏడాది. ఏప్రిల్ నుంచీ జూలై వరకూ ఒక సిలిండర్, ఆగష్టు నుంచీ నవంబర్ వరకూ ఒక సిలిండర్, డిసెంబర్ నుంచీ మార్చి వరకూ ఒక సిలిండర్ రెగ్యులర్ గా ఇవ్వడం జరుగుతుంది అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news