జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు వైసిపి మంత్రి రోజా. పవణ్ కళ్యాణ్ రోజుకొక పార్టీతో , రోజుకొక స్టేట్ మెంట్ తో తెగిపోయిన గాలిపటంలా వ్యవహరిస్తున్నాడని అర్ధం చేసుకొన్న మోడి.. ఇతనితో బిజేపికి ఒరిగేదిలేదని భావించినట్టున్నాడని అన్నారు. ఇతనికి రాష్ట్రంలో ప్రజాబలం లేదని బిజేపి నేతలు నిర్ణయానికి వచ్చారని పేర్కొన్నారు.అందుకే మొన్న విశాఖ టూర్ లో పవన్ ను పక్కన పెట్టాడని ఎద్దేవా చేశారు.
కిరణ్ రాయల్ పై నేను కంప్లైంట్ చేయలేదని… నేను అతనితో ఫోన్ లో మాట్లాడలేదని స్పష్టం చేశారు. “నన్ను జైల్లో పెట్టాలంటే ఫస్ట్ నేను తప్పు చేయాలి.. నేను తప్పు చేసినట్టు ఆధారాలు ఉంటే బహిర్గాతం చేయండి. రోజాను మాట్లాడితే ఫేమస్ అవ్వొచ్చని , పబ్లిసిటి వస్తుందని , మీడియా ప్రయారిటీ ఇస్తుందని, ఇలాంటి వారంతా నాపై నోరుపారేసుకుంటున్నారు. కిరణ్ అనే వ్యక్తి రాయల్ అని తన పేరు పక్కన వ్యాపారం కోసమే చేర్చుకున్నాడు. జనసేనకు , పవన్ కు అతని వల్ల నష్టం తప్ప లాభం లేదు” అని చిత్తూరు లో ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన మంత్రి రోజా వ్యాఖ్యానించారు.