ఇదిగో లెక్క‌.. చింత‌మ‌నేనికి ఎమ్మెల్యే అబ్బ‌య్య చౌద‌రి స‌వాల్‌!

-

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా దెందులూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచిన అబ్బ‌య్య చౌద‌రి.. వైసీపీ త‌ర‌ఫున మంచి మౌత్ పీస్‌గా గుర్తింపు పొందారు. ఇటీవ‌ల కొన్ని కేసుల్లో అరెస్ట‌యిన‌.. టీడీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏం చేసింది? ఏడాది పూర్తి చేసుకోవ‌డం త‌ప్ప ఏమీ చేయ‌లేద‌ని దెప్పి పొడిచారు. దీనికి స‌మాధానంగా తాజాగా.. అబ్బ‌య్య చౌద‌రి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వ హ‌యాలో ఏడాది కాలంలో లెక్క‌ల‌తో స‌హా వెల్ల‌డించారు. మ‌రీ ముఖ్యంగా యువ‌త‌కు ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివ‌రించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సీఎం జీవం పోశారని అబ్బయ్య చౌదరి అన్నారు.

ఎంఎస్‌ఎంఈల ద్వారా10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. సింగిల్‌ విండో విధానాన్ని కూ డా సీఎం జగన్‌ తీసుకొచ్చారని తెలిపారు. రీస్టార్ట్ ప్యాకేజీ రూపంలో ఎంఎస్‌ఎంఈలకు మొదటి విడతలో రూ.450 కోట్లు రెండో విడతలో రూ.512 కోట్లు సీఎం  విడుదల చేశారని చెప్పారు. ఎంఎస్‌ఎంఈలను ఆదు కునేందుకు రీస్టార్ట్‌ ప్యాకేజీని ప్రకటించారని చెప్పారు. ఏపీ  సోషల్‌ రిఫార్మర్ సీఎం జగన్‌ అని అబ్బయ్య చౌదరి కొనియాడారు. ఎల్లో మీడియా కీయా మోటార్స్ తరలిపోతుందని తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు. కీయా మోటార్స్ తమ ప్లాంట్‌ను మరింత విస్తరిస్తామని ప్రకటించిందని గుర్తుచేశారు.

సౌత్ ఇండియాకు పారిశ్రామిక ముఖద్వారంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని సీఎం భావిస్తున్నారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని పేర్కొ న్నారు. విజన్ ఉన్న నేత జ‌గ‌న్ అని అన్నారు. చంద్రబాబు ఎన్ని ఇండస్ట్రీల్ సమ్మిట్‌లు పెట్టినా రాష్ట్రా నికి ఎటువంటి పెట్టుబడులు రాలేదని ఎద్దేవా చేశారు.  ఎంఎస్‌ఎంఈలకు చంద్రబాబు ప్రభుత్వం 4 వేలకోట్లు బకాయిలు పెట్టిందని , ఎంఎస్‌ఎంఈలు పెట్టిన వాళ్లలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు అధికంగా ఉన్నారని తెలిపారు. వాటికి మేలు చేసే విధంగా రూ.182 కోట్లు విద్యుత్ బకాయిలు సీఎం వైఎస్‌ జగన్‌ రద్దు చేశారని గుర్తు చేశారు.  మొత్తంగా చింత‌మ‌నేనికి లెక్క‌ల‌తో స‌హా.. అబ్బ‌య్య చౌద‌రి కౌంట‌ర్ ఇచ్చారు. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గంలో ఇదే హాట్ టాపిక్‌గా మార‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news