ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ కీలక నిర్ణయం

-

కాకినాడ: కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి – జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. రాజకీయ దుష్ట శక్తుల నుంచి కాకినాడ ప్రతిష్టను కాపాడేందుకు “నా కాకినాడ – మన కాకినాడ” పేరుతో ప్రచార ఉద్యమం చేపట్టాలని ఎమ్మెల్యే ద్వారంపూడి నిర్ణయం తీసుకున్నారు.

 

పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై కాకినాడ పౌరులను చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాల వలన కాకినాడ పేరు అపఖ్యాతిపాలవుతుందని.. మన ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ఈ కార్యక్రమంలో కలిసి రావాలని ప్రజలను కోరారు ఎమ్మెల్యే ద్వారంపూడి. రాజకీయాలకు అతీతంగా సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు ద్వారంపూడి.

Read more RELATED
Recommended to you

Latest news