ఆ మంత్రులకి సీటు లేదా? జగన్ సెన్సేషన్.?

-

వైసీపీ మళ్ళీ గెలవడం కోసం జగన్ ఎలాంటి సంచలన నిర్ణయాలైన తీసుకునేలా ఉన్నారు. సరిగ్గా పనిచేయకుండా ప్రజా మద్ధతు లేని నాయకులకు జగన్ సీటు ఇవ్వడం జరిగే పని కాదు. ఇప్పటికే పలుమార్లు సరిగా పనిచేయని నేతలకు సీటు ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేశారు. అయితే పలుమార్లు పనితీరు మెరుగు పర్చుకునే అవకాశాలు ఇచ్చారు. కానీ కొందరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు.

దీంతో వైసీపీలో కొందరు ఎమ్మెల్యేల పనితీరు పెద్దగా బాగోలేదు. వచ్చే ఎన్నికల్లో వారికి సీట్లు ఇస్తే గెలవడం కష్టం. ఆ విషయం జగన్‌కు కూడా తెలుసు. ఇప్పటికే పార్టీ అంతర్గత సర్వేల్లో కూడా అదే తేలింది. దీంతో ఎంతటి వారికైనా సరిగా లేకపోతే సీటు ఇవ్వడం కష్టం. ఇదే క్రమంలో కొందరు మంత్రుల పనితీరు కూడా సరిగ్గా లేదని తెలుస్తుంది. మంత్రులుగానే కాదు..వారి నియోజకవర్గాల్లో కూడా విఫలమయ్యారని తెలిసింది. మొత్తం జగన్ కేబినెట్ లో 25 మంది మంత్రులు ఉన్నారు. అందులో దాదాపు 10 మంది మంత్రుల పనితీరు బాగోలేదని తెలిసింది.

అలాగే వారు ఎమ్మెల్యేలుగా తమ నియోజకవర్గాల్లో కూడా వెనుకబడ్డారు. ఇక అలాంటి వారికి జగన్ సీటు ఇచ్చే విషయంలో ఆలోచనలో ఉన్నారని తెలిసింది. రాయలసీమలో ఒక మంత్రి, కోస్తాలో దాదాపు అయిదారుగురు, ఉత్తరాంధ్రలో ఇద్దరు, ముగ్గురు మంత్రుల పనితీరు పెద్దగా బాగోలేదని తెలిసింది.

అయితే పనితీరు బాగోలేని మంత్రులందరిని పక్కన పెట్టడం కష్టం. వారికి సొంతంగా అంటూ ఓ ఇమేజ్ ఉంటుంది. అలాంటప్పుడు వారికి సీటు ఇవ్వకపోయినా ఇబ్బందే…సీటు ఇచ్చిన ఇబ్బందే. అందుకే కొందరికి వేరే సీట్లు కేటాయిస్తారని తెలుస్తుంది. ఈ క్రమంలో కొందరు మంత్రులని ఎంపీలుగా పంపే అవకాశాలు ఉన్నాయని సమాచారం. చూడాలి మరి ఏ మంత్రి సీటుకు ఎసరు వస్తుందో.

Read more RELATED
Recommended to you

Latest news