సుప్రీం కోర్టులో వైసీపీ ఎంపీ ఎంపి అవినాష్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టును ఇవాళ ఆశ్రయించారు వైసీపీ ఎంపి అవినాష్ రెడ్డి. ముందస్తు బెయిల్ పై విచారణను హైకోర్టులో వెంటనే తేల్చెలా సుప్రీం కోర్టు ఆదేశించాలని ఈ పిటీషన్ ద్వారా కోరాడు.
సుప్రీం కోర్టు పరిశీలన లో ఉండటం వల్ల తన ముందస్తు బెయిల్ విచారణ త్వరగా తేలటం లేదు.. వెకేషన్ కోర్టులో నా ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ ముగించెలా ఆదేశాలు ఇవ్వండని కోరాడు.
అప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోవడమే సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు అవినాష్ రెడ్డి. ఈ మేరకు వెకేషన్ బెంచ్ ముందు ప్రత్యేక మెన్షన్ చేశారు అవినాష్ తరపు న్యాయవాదులు. అయితే.. ఈ పిటీషన్ ను సుప్రీం కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఇప్పుడు ఈ పిటీషన్ ను విచారించలేమని పేర్కొంది సుప్రీం కోర్టు. దీంతో సుప్రీం కోర్టులో వైసీపీ ఎంపీ ఎంపి అవినాష్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది.