సీఎం జగన్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎంపీ నందిగాం సురేష్

-

అమరావతి: పార్టీ కేంద్ర కార్యాలయం దగ్గర ముఖ్యమంత్రి జగన్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు ఎంపీ నందిగాం సురేష్, ఇతర దళిత నేతలు. 2017లో కురుక్షేత్ర మహాసభలో పాల్గొన్న పలువురు విద్యార్థులు, దళిత సంఘాల నేతల పై నాటి టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టిందన్నారు. అప్పటినుండి దళిత సంఘాలు కేసులు ఎత్తివేయాలని కోరుతున్నారని.. తాజాగా దళితులపై గత ప్రభుత్వం పెట్టిన కేసులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్.

ముఖ్యమంత్రి నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశారు నేతలు. ఈ సందర్భంగా ఎంపీ నందిగాం సురేష్ మాట్లాడుతూ.. దళితుళపై గత ప్రభుత్వం పెట్టిన కేస్‌లు ఎత్తేయాలని సీఎం జగన్‌ను కోరామన్నారు. కేసులు ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గత ప్రభుత్వం ఎస్సి, ఎస్టీలపై అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిందన్నారు. అనేక రకాలుగా టీడీపీ నేతలు అవమానించారని.. ఇప్పుడు టీడీపీ దళితులతో సమావేశాలు పెడుతోందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version