నాయి బ్రాహ్మణులకు రాష్ట్రంలోని ప్రతీ దేవాలయ పాలకవర్గాలలో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన సందర్భంగా దుర్గగుడి కేశఖండన శాల వద్ద సిఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాలయాల జెఎసి నేతలు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్ధవటం యానాదయ్య మాట్లాడుతూ, నాయీ బ్రాహ్మనుల ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్న ఏకైక వ్యక్తి సిఎం జగన్ అని, సిఎం జగన్ నాయీ బ్రాహ్మణుల పట్ల అత్యున్నతమైన నిర్ణయం తీసుకున్నారన్నారు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా నాయీ బ్రాహ్మణులను గుర్తించింది లేదు.. గతంలో నాయీ బ్రాహ్మణుల సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెల్తే మమ్మల్ని అవమానకరంగా మాట్లాడారని వెల్లడించారు.
ఇదే సేవకులు బానిసలు కాదు పాలకులు చేస్తానన్న సిఎం జగన్ తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.. దేవాలయాల్లో మా సమస్యలపై చర్చ జరగేది కాదు…సిఎం జగన్ పాలకవర్గంలొ భాగస్వామ్యం చేయడం మరువరానిదని చెప్పారు. రాష్ట్రంలో వెయ్యికి పైగా దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణులంతా సిఎం జగన్ కు రుణపడి ఉంటాం.. దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు ఉద్యోగ బధ్రత కల కూడా వారం రోజుల లోపే నెరవేరబోతుందన్నారు.