డాక్టర్.ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీపేరును తొలిగించటం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని.. అదే పేరు కొనసాగించాలని నందమూరి రామకృష్ణ డిమాండ్ చేశారు. డాక్టర్.ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివర్సిటీ పేరును తొలిగించటం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఈ యూనివర్సిటీకి మూల కారకుడు, వ్యవస్థాపకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారకరామా రావు గారన్నారు.
అన్ని మెడికల్ కాలేజీలు ఒకే పాలసీతో నడవాలనేది వారి భావన అని.. ఈ ఉద్దేశముతో 1986 లో స్వర్గీయ నందమూరి తారకరామా రావు గారు స్థాపించారని గుర్తు చేశారు. అందరు, అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు వారి వారి మద్దతు హర్షం వ్యక్తం చేశారు…. నందమూరి తారకరామా రావు గారు 1996 లో స్వర్గస్థులైయ్యారని… అప్పటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ స్థాపించారు కాబట్టి ఎన్టీఆర్ అనే పదాన్ని సమకూర్చి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరుగా నామకరణం చేశారని పేర్కొన్నారు.
రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీదున్న అభిమానం గౌరవంతో “డాక్టర్” ఎన్టీఆర్ మెడికల్ హెల్త్ యూనివెర్సిటీగా నామకరణం చేశారని..అదే పేరును మార్చటం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పేరును తొలిగించటం యావత్ తెలుగు జాతిని అవమానించినట్లేనని… అన్ని పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు చెందిన మహా నాయకుడు యుగపురుషుడు ఎన్టీఆర్ అన్నారు.