పల్నాడు జిల్లా రెంటచింతల రోడ్డు ప్రమాదం పై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాగా శ్రీశైలం దర్శనానికి వెళ్లి వస్తున్న టాటా ఏస్ వాహనం ఆగివున్న లారీని ఢీ కొట్టింది. డ్రైవరు నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
పల్నాడు జిల్లా రెంటచింతల విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆదివారం అర్ధరాత్రి ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెంటచింతల కు చెందిన 38 మంది టాటా ఏస్ వాహనంలో శ్రీశైలం వెళ్లి వస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకుంటాము అనగా రెంటచింతల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద వారు ప్రయాణిస్తున్న వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను గురజాల ఆసుపత్రికి తరలించారు.
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదంలో ఏడుగురి మృతి కలచివేసింది. మృతుల కుటుంబాలకి నా ప్రగాఢ సంతాపం. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలి. మృతుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలి. pic.twitter.com/PhNz9nYzeR
— Lokesh Nara (@naralokesh) May 30, 2022