Realme Pad X: రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్లెట్.. బడ్జెట్‌లోనే బోలెడు ఫీచర్స్‌..

-

రియల్‌మీ నుంచి కొత్త ట్యాబ్లెట్‌ ఇండియన్‌ మార్కెట్‌లోకి రానుంది. ఇటవలో.. చైనాలో రియల్‌మీ ప్యాడ్‌ ఎక్స్‌ విడుదల అయింది. ఇది త్వరలో ఇండియన్‌ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇది కూడా ఒక బడ్జెట్‌ ట్యాబ్‌.. ఇందులో ఏం ఫీచర్స్ ఉన్నాయి, కెమెరా క్వాలిటీ ఏంటి, హైలెట్స్‌ ఏంటో చూద్దామా..!

Realme Pad X ధర..

4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ ఉన్న రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ ట్యాబ్ ధర చైనాలో 1,299 యువాన్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ.15,000గా ఉంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర 1,599 యువాన్లు అంటే..రూ.18,400గా ఉంది.

Realme Pad X స్పెసిఫికేషన్లు..

స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ ట్యాబ్ వస్తోంది.
గరిష్ఠంగా 6జీబీ ర్యామ్ ఉంటుంది. అయితే ఇంటర్నల్ స్టోరేజీని ఉపయోగించుకొని వర్చువల్‌గా 5జీబీ ర్యామ్ వరకూ పెంచుకోవచ్చు.
స్టోరేజీని పొడిగించుకునేందుకు మైక్రోఎస్‌డీ కార్డు స్లాట్ కూడా ఈ ట్యాబ్‌లో ఉంది.
11 ఇంచుల 2K రెజల్యూషన్ డిస్‌ప్లేను Realme Pad X కలిగి ఉంది.
DC డిమ్మింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ఆండ్రాయిడ్‌ ఆధారిత రియల్‌మీ ప్యాడ్ యూఐ 3.0 ఓఎస్‌పై ఈ ట్యాబ్ రన్ అవుతుంది.
Realme Pad Xలో 8,340mAh బ్యాటరీ ఉంటుంది.
33వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మొత్తంగా ఈ ట్యాబ్ 499 గ్రాములు ఉంటుంది.

కెమెరా క్వాలిటీ..

Realme Pad X వెనుక 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది.
అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తోంది.
డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌తో ఈ ట్యాబ్ వస్తోంది.
డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉన్న నాలుగు స్పీకర్లు ఈ ట్యాబ్‌కు ఉన్నాయి.
రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ గురించి మాధవ్ సేథ్ ట్వీట్ చేశారు. భారత్‌లో ఈ ట్యాబ్‌ను లాంచ్ చేయాలా అంటూ యూజర్లను ట్వీట్‌ ద్వారా అడిగారు. చైనాలో విడుదల చేసిన కాసేపటికే మాధవ్ ఈ ట్వీట్ చేయడంతో.. ఇండియన్‌ మార్కెట్‌లోకి రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ రావడం పక్కా అయింది. అయితే ఇంకా తేదీ ఖరారు కాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news