చినబాబును రెచ్చగొడుతున్న తమ్ముళ్లు… సారీ ఐ కాంట్!

-

యువకుడు, ఉత్సాహవంతుడు, విదేశాల్లో పట్టబద్రుడైన మేధావి, చినవయసులోనే మంత్రి అయ్యి తన మార్కు పనితనం కనబరిచిన యువనేత అయిన నారా లోకేష్ ను టీడీపీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారంట! గతాన్ని గుర్తుచేస్తూ మరీ ఉత్సాహపరుస్తున్నారంట! చినబాబు యు కెన్ అని అంటున్నారంట! కానీ చినబాబు మాత్రం… సారీ.. ఐ కాంట్ అని అంటున్నారంట! ఇంతకూ ఆ వ్యవహారం ఏమిటో ఇప్పుడు చూద్దాం!

“వస్తున్నా మీ కోసం” అంటూ సుమారు ఎనిమిదేళ్ల క్రితం చంద్రబాబు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే! దీంతో.. పాదయాత్రకు ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా చినబాబుకు తన తండ్రి గతాన్ని గుర్తుచేస్తూ రెచ్చగొడుతున్నారంట. నాడు పాదయాత్ర చేసే సమయానికి బాబుకున్న వయసుతో పోల్చితే మీరు చాలా యంగ్ అండ్ ఎనర్జిటిక్ అని అంటున్నారంట!

అవును.. ప్రస్తుతం ప్రతీ టీడీపీ కార్యకర్త చినబాబు నుంచి కోరుకుంటున్నది అదే! చంద్రబాబు వల్ల ఎలాగూ కాదు కాబట్టి.. ప్రస్తుతానికి బాబుతో తెరవెనుక రాజకీయాలు చేయిస్తూ.. తెరముందు చినబాబు ఆడాలని కోరుతున్నారంట. అందులో భాగంగా.. జగన్ కంటే కనీసం ఒక్క కిలోమీటర్ అయినా ఎక్కువ దూరం పాదయాత్ర చేయాలని.. చరిత్ర తిరగరాయాలని ఆశిస్తున్నారంట!

అవును… చినబాబు వద్దకు కొందరు సన్నిహిత నాయకులు ఈ డిమాండ్ ను తీసుకొచ్చారని అంటున్నారు. అయితే… ఈ విషయంలో తనదైన స్మైల్ ఒకటి కాస్త గట్టిగానే ఇచ్చిన లోకేష్… అలాంటివి తననుంచి ఆశించొద్దని, అది తనవల్ల కానిపని అని, వేరే “షార్ట్ కట్స్” ఏమైనా ఉంటే చెప్పమని అన్నారంట!! ప్రస్తుతం తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్న సంగతి ఇది!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news