ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీలోనే వైసీపీ సభ్యులు దాడికి తెగబడటం దారుణమని టిడిపి నేత నారా లోకేష్ విమర్శించారు. అధికారం కోసం సొంత బాబాయ్ ని చంపిన వాళ్ళు ఇతరులను గౌరవిస్తారు అనుకోవడం వృధా ప్రయాసేనమన్నారు.
MlC ఎన్నికల్లో YCP కి కర్రు కాల్చి బాధ పెట్టిన ఫ్రాక్షన్ బుద్ధి మారలేదని చెప్పారు. కొండేపి ఎమ్మెల్యే డాక్టర్ బాల వీరాంజనేయ స్వామి పై దాడి ప్రజాస్వామ్య వ్యవస్థకే కళాంకమని తెలిపారు.
టిడిపి సభ్యుడు బాల వీరాంజనేయ స్వామి స్పీకర్ పై దాడికి ప్రయత్నించారని YCP ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆరోపించారు. టిడిపి ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు వైసిపి ఎమ్మెల్యే ఎలిజా వెళ్లగా, ఆయనను కూడా కిందకు తోసే ప్రయత్నం చేశారని చెప్పారు. ఎలిజాను కాపాడేందుకు తాను వెళ్ళగా తనపైన టిడిపి ఎమ్మెల్యేలు దాడి చేశారని సుధాకర్ బాబు చెప్పారు. ఈ దాడి విజువల్స్ ను విడుదల చేయాలని స్పీకర్ ను కోరారు.