వివేకానంద రెడ్డి హత్యకేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేసింది సుప్రీం కోర్టు. వివేకా కుమార్తె సునీత పిటిషన్ పై ఇవాళ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. హైదరాబాద్ సీబీఐ స్పెషల్ కోర్టుకు బదిలీ చేస్తూ తీర్పునిచ్చింది సుప్రీం కోర్టు ధర్మా సనం. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
నేర విచారణ నిష్పాక్షికంగా జరపడం కోసమే విచారణ బదిలీ చేసింది సుప్రీం కోర్టు. అయితే ఈ కేసు తీర్పు పై టిడిపి నేత నారా లోకేష్ స్పందించారు. బాబాయ్ కేసు తెలంగాణ రాష్ట్రానికి… అబ్బాయ్ చంచల్ గూడ జైలుకి అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. కచ్చితంగా ఈ కేసులో ఈ దోషులు తెలుతారని ఆయన పేర్కొన్నారు.