కొత్త చట్టాలు కాదు.. కనీసం ఉన్న చట్టాల ప్రకారం కూడా చర్యలు తీసుకోవడం లేదు – చంద్రబాబు

-

కాకినాడ జిల్లా కాండ్రేగుల కూరాడా గుబ్బల దేవిక అనే యువతి ప్రేమానుమాది ఘాతుకానికిి బలైపోయింది. కూరాడా గ్రామంలో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్న దేవిక డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థిని. అదే గ్రామానికి చెందిన వెంకట సూర్యనారాయణ ప్రేమ పేరుతో దేవికను వేధించేవాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో కత్తితో దాడి చేయగా.. దేవిక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

నిందితుడు వెంకట సూర్యనారాయణ ను పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటనపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. “మహిళలపై నేరాలను అరికట్టే విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ది ప్రకటనలకే పరిమితం అవుతుంది. కాకినాడలో దేవిక హత్య విషయంలో చట్టమే లేని దిశా చట్టం ప్రకారం నిందితులపై చర్యలు అంటూ స్వయంగా సిఎం ప్రకటనలు చెయ్యడం మోసగించడమే.

సిఎం, ప్రభుత్వం ఇలాంటి ఉత్తుత్తి ప్రకటనలు మాని.. నిందితులకు వెంటనే శిక్షపడేలా చూడాలి. అప్పుడే నేరస్థులకు భయం… మహిళలకు నమ్మకం కలుగుతుంది. కొత్త చట్టాలు కాదు…కనీసం ఉన్నచట్టాల ప్రకారం కూడా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. గుంటూరు జిల్లాలో అత్యాచారం కేసుపెట్టిన వివాహిత ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. మహిళల పై నేరాల విషయంలో ప్రభుత్వం ఎంత అలసత్వంతో ఉందో అర్థం అవుతుంది”. అని ట్విట్ చేశారు.
https://twitter.com/ncbn/status/1578965590001143809?s=20&t=XkDrWHfe5yfmTHsvAsJf6w

Read more RELATED
Recommended to you

Latest news