ఉద్రిక్తత మధ్య గుడివాడలో ఎన్టీఆర్ వర్ధంతి

-

గుడివాడలో ఇవాళ ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఉద్రక్తత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఉద్రిక్తల నడుమ గుడివాడ ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకున్నారు టీడీపీ నేతలు. ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని నివాళులర్పించారు తెలుగుదేశం,  జనసేన పార్టీల నేతలు. గుడివాడ గడ్డ తెలుగుదేశం అడ్డా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ముఖ్యంగా చంద్రబాబు-పవన్ కళ్యాణ్ జోడీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉంచినటువంటి జూనియర్ ఎన్టీఆర్ జెండాని తొలగించి.. టీడీపీ జెండాను  పెట్టారు టీడీపీ నేతలు. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు మాజీ ఎమ్మెల్యే రావి, గుడివాడ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము. మరోవైపు  ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో టెన్షన్ వాతావరణమే నెలకొందని చెప్పాలి. గుడివాడలో పోటాపోటీ ర్యాలీలు చేపట్టాయి టీడీపీ – వైసీపీ. జూనియర్ ఎన్టీఆర్ జెండాలతో వైసీపీ కార్యకర్తలు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ర్యాలీ నిర్వహించారు.  కొత్త మున్సిపల్ ఆఫీస్ వద్ద  టీడీపీ – వైసీపీ నేతలు  ర్యాలీ తీస్తూ ఎదురుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news