ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు – వరుణుడికి ఉన్న అవినాభా సంబంధం ఈనాటిది కాదనేది అందరికీ తెలిసిన విషయమే! అది యాదృచికమా కాకతాలీయమా అన్నది ప్రస్తుతానికి అప్రస్తుతమే అవ్వొచ్చు కానీ… వాస్తవానికి ఏపీ ప్రజలకున్న అనుభవం మాత్రం అదే! అయితే ఈ విషయంలో తాజాగా చాలా కాలం తర్వాత ఏపీకి వచ్చిన చంద్రబాబుకు వరుణుడు వరద రూపంలో వచ్చి బాబు కు నిన్నమొన్నటివరకూ ప్లస్ అవుతాడని అంతా భావిస్తే… ఇప్పుడు మైనస్ అవ్వనున్నాడని తెలుస్తుంది!
అవును… ముందస్తు చర్యల్లో భాగంగా, బాబుపై ఉన్న ప్రభుత్వానికున్న బాధ్యత దృష్ట్యా.. కృష్ణానదీ తీరంలో ఉన్న కరకట్ట ప్రాంత నివాసాలకు ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే! కృష్ణానది వరద ఉధృతి పెరుగుతున్న దశలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం కృష్ణా వరద ముంపుకు గురవుతుందని నిన్నటి వరకూ ప్రభుత్వం ఆదోళన చెందింది! ఫలితంగా ఈ సాకుతో భాగ్యంగరానికి జంప్ అయిపోవచ్చని, జనాలు కూడా అర్ధం చేసుకుంటారని బాబు భావించి ఉండొచ్చు!
అయితే.. తాజా సమాచారం ప్రకారం.. కృష్ణానది వరద ఉధృతి క్రమంగా తగ్గుతుండడంతో కరకట్ట వెంబడి ఉన్న నివాసాలకు ఎలాంటి ముంపు ప్రమాదం లేదని తెలుస్తోంది. ఫలితంగా చంద్రబాబు నివాసానికి ఎటువంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది! దీంతో… బాబుకు ఆఛాన్స్ మిస్సయ్యిందని.. ఇక అమరావతిలో ఉండటం తప్పకపోవచ్చని.. భాగ్యనగరానికిపోయి జాగ్రత్తలు తీసుకునే చాన్స్ మిస్సయ్యిందని.. ఫలితంగా వరుణుడు ఈ సారి బాబుకు దెబ్బకొట్టాడని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు!