ప్రతిపక్షాలు తమ ప్రభుత్వంపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కడప ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి పెద్దిరెడ్డి. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం అంజాద్ భాష, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ కర్నూల్, అనంతపురం, కడప శాసనమండలికి ఎన్నికలు జరుగుతున్నాయని.. మా అభ్యర్థులు శాసనసభ్యులతో కలిసి మమేకమై విజయం దిశగా అడుగులు వేసేందుకు సమన్వయ సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కి అత్యధిక పెట్టుబడులు వచ్చాయని తెలిపారు మంత్రి. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులకు, పట్టభద్రులకు అనేక మంచి పనులు చేశారని ప్రశంసలు కురిపించారు.