AP: నారాయణ బెయిల్ రద్దుకు హైకోర్ట్ కు ఏపీ సర్కార్… రేపు లంచ్ మోషన్ పిటిషన్

-

ఏపీ రాజకీయం మొత్తం ఇప్పుడు టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ చుట్టే తిరుగుతోంది. పేపర్ లీక్ వ్యవహారంలో ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్ లో నారాయణను అరెస్ట్ చేసి చిత్తూర్ తరలించారు. మంగళవారం ఈ అరెస్ట్ చోటుచేసుకుంది. ఇదిలా ఉంటే నారాయణను కోర్ట్ లో ప్రొడ్యూస్ చేయగా… మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చారు. నారాయణ తరుపున వాదించిన లాయర్లలో మెజిస్ట్రేట్ ఏకీభవించి బెయిల్ మంజూరు చేశారు.

ఇదిలా ఉంటే నారాయణ బెయిల్ రద్దుకు ప్రభుత్వం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రేపు నారాయణ బెయిల్ రద్దుపై ఏపీ హైకోర్ట్ లో లంచ్ మోహన్ మూవ్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం పలువురు న్యాయ నిపుణులు, అధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇటీవల నారాయణ స్కూళ్ల నుంచి టెన్త్ పేపర్ లీక్ అయింది. దీనిపై సీఎం జగన్ స్వయంగా మాజీ మంత్రి నారాయణ, ఆయన స్కూళ్లపై విమర్శలు గుప్పించారు. ఆ తరువాత నారాయణ అరెస్ట్ జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news