ముద్రగడ సలహా తీసుకుని పవన్ నా మీద పోటీ చేయాలని సవాల్ చేశారు ద్వారంపూడి చంద్రశేఖర్. ఇప్పటి వరకు నా మీద పోటీ చేస్తాడని ఎదురు చూసానని… నా మీద పోటీ చేస్తానని నిర్ణయం తీసుకొకపోవడం బాధాకరం అని చురకలు అంటించారు. తోక ముడుచుకుని వెళ్లిపోతున్నాడని…. నువ్వు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్లు లెక్క అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఒక స్ట్రాటజీ తో చంద్రబాబు ఇచ్చిన ప్లాన్ ప్రకారం వారాహి యాత్ర చేస్తూన్నాడని.. చంద్రబాబు ఆడిస్తే ఇతను ఆడుతున్నాడని ఫైర్ అయ్యారు. కాపులు, రెడ్లు కలిసి ఉన్నారని… చంద్రబాబు చెప్పు చేతలు కింద జనసేన పార్టీ ఉందని విమర్శలు చేశారు. నన్ను తిట్టడానికే ఇక్కడికి వచ్చాడని.. నాలుగు గంటల లోపు, వెళ్లే లోపు నా మీద పోటీ చేస్తానని చెప్పాలన్నారు. లేదంటే ఆ మాటలు వెనక్కి తీసుకున్నట్లు అనుకుంటానని.. ముద్రగడ ప్రకటన చేయడం చాలా సంతోషం, మా కుటుంబం తరపున ధన్యవాదాలు అన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్.