రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను..ఒక్కసారి గెలిపించండని కోరారు పవన్ కళ్యాణ్. వచ్చే ఎన్నికల్లో గెలిపించండి మిమ్మల్ని అభ్యర్దిస్తున్నాను.. మీరు నాకు ఎంపీలను ఇవ్వండి.. నేను పని చేయిస్తానని పేర్కొన్నారు పవన్ కల్యాణ్. చాలా కమిట్మెంట్ తో పార్టీ ప్రాంభించా.. అధికారమే అంతిమ లక్ష్యం అనుకుంటే ఇంత కష్టపడక్కర్లేదు.. నాకు ఉన్న కెపాసిటీకి ఏదో పదవి పొందొచ్చు, ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదని వెల్లడించారు పవన్ కల్యాణ్.
ప్రస్తుత ఉన్న సీఎంలా అద్భుతాలు చేస్తాను అని చెప్పడం లేదు.. బటన్ నొక్కితే డబ్బులు పడతాయని చెప్పను.. సరైన వ్యక్తిని మీరు నమ్మడం లేదు.. మీ విశ్వాసం, నమ్మకం సరైన వ్యక్తులపై పెట్టడం లేదని వివరించారు పవన్ కల్యాణ్. రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను.. వచ్చే ఎన్నికల్లో గెలిపించండి మిమ్మల్ని అభ్యర్దిస్తున్నాను.. మీరు నాకు ఎంపీలను ఇవ్వండి.. నేను పని చేయిస్తానంటూ చెప్పారు పవన్ కల్యాణ్. పవన్ కల్యాణ్‌కి ఇంత ఓటు షేర్ ఉందనే పీఎం నన్ను పిలిపిస్తారు.. అభివృద్ధి రోడ్డు మీద పడేయకూడదు.. 40 గజాల్లో ఇల్లు ఏం వస్తుందని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. ఏపీ ఆర్ధిక వ్యవస్థకి మీ కష్టం, మీ రక్తం, మీ శ్రమ కారణం.. మీ ఆదాయం సీఎం ముగ్గురుకి అంటగట్టేశాడు.. మీరు నా కోసం నిలబడితే.. మీ కోసం నేను పోరాటం చేయగలను.. నాకు ఎవరితో కుమ్మక్కు అవ్వాల్సిన అవసరం లేదన్నారు పవన్ కల్యాణ్.