చంద్రబాబు అవినీతిలో పవన్ కళ్యాణ్ భాగస్వామే : సీఎం జగన్

-

కాకినాడలో వైఎస్ పెన్షన్ పెంపు కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలని తెలిపారు. పెన్షన్ రూ.2750 నుంచి రూ.3000 పెంచారు.  గత ప్రభుత్వంలో పేదలకు మేలు జరిగిందా..? ఈ ప్రభుత్వంలో మేలు జరిగిందా ఆలోచించాలని సూచించారు. చంద్రబాబు హయాంలో రైతు భరోసా.. వైఎస్సార్ ఆసరా వంటివి ఏమి లేవు. మారిందల్లా ముఖ్యమంత్రి ఒక్కడే.. అదే బడ్జెట్.. అదే రాష్ట్రం.అయినప్పటికీ రాష్ట్రాన్ని ఈ జగనన్న ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. 

చంద్రబాబు, పవన్ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారు. పేదలకు మూడు సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంట్ కూడా ఇవ్వలేదన్నారు. 2014 ఎన్నికల్లో దత్తపుత్రుడు, దత్త తండ్రి ప్రజలను అడ్డగోలుగా మోసం చేశారు. ప్రశ్నిస్తానన్న దత్తపుత్రుడు కనీసం కేంద్రానికి ఒక లేఖ కూడా రాయలేదు. పేదలకు ఇచ్చే ఇళ్లపై అవినీతి జరిగిందంటూ కేంద్రానికి లేఖ రాశారు. జైలులో ఉన్న అవినీతి పరుడు చంద్రబాబును దత్త పుత్రుడు పరామర్శిస్తాడు. చంద్రబాబు అవినీతిలో పవన్ కళ్యాణ్ కూడా భాగస్వామే.. అందుకే చంద్రబాబు అవినీతికి పాల్పడినా స్పందించడు. కానీ అవినీతికి తావు లేకుండా పాలన చేస్తున్న మన ప్రభుత్వం పై విమర్శలు చేస్తాడు. 

Read more RELATED
Recommended to you

Latest news