బీజేపీ ఆటలో జనసేనాని పవన్‌కల్యాణ్ ఆటలో అరటిపండు కాబోతున్నారా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ – పవన్‌ల మధ్య జరుగుతున్న సంఘటనలని చూస్తున్న రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే మాట చెబుఉన్నారు. లాజిక్‌కు అందకుండా పవన్ మాట్లాడుతున్న తీరు కూడా ఇందుకు అద్దంపడుతోందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఏపీకి రాజధానిగా వుండాలని బీజేపీ నాయకులు, అధినాయకత్వం వాధిస్తోంది. కానీ అధికారంలో వున్న ఎన్డీయే మాత్రం ఆ అవసరం లేదని చెబుతోంది.
ఈ వింత నాటకాన్ని పసిగట్టలేని పవన్‌కల్యాణ్ కూడా ఎన్టీయే వేరని, బీజేపీ వేరని వింత వాదన వినిపిస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు అవాక్కవుతున్న వారంతా ఇదేం లాజిక్కే పవనన్నా అంటూ అవాక్కవుతున్నారు. ఏపీకి మూడు రాజధానులు అవసరమని వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ తీర్మానించడం తెలిసిందే. అయితే దీనిపై టీడీపీ వర్గాలు రార్ధాంతం చేస్తుంటే రాజధాని రైతులు విలువైన భూముల్ని పణంగా పెట్టామని కొన్ని నెలలుగా నిరసన గళం విప్పుతున్నారు. దీనికి కేంద్రమే న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అయితే కేంద్రం మాత్రం మూడు రాజధానుల విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదని సెలవిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ మాత్రం మూడు రాజధానులు అవసరం అఏదని అమరాతే రాజధాని అంటూ కొత్త డ్రామా మొదటుపెట్టింది. ఈ లాజిక్ అర్థం కాని జనసేనాని పవన్‌కల్యాణ్ మాత్రం బీజేపీ వేరు కేంద్రంలో వున్న ఎన్డీయే వేరని వింత వాదన వినిపించడంతో పార్టీ శ్రేణులే అవాక్కవుతున్నాయట.