పోరస్‌ కంపెనీ బాధిత కుటుంబాలకు కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలి – పవన్‌ కళ్యాణ్‌

-

పోరస్ కెమికల్ కర్మాగారంలో మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడెంలోని పోరస్ కెమికల్ కర్మాగారంలో చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం అత్యంత విషాదకరమని.. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని.. కష్టం మీద బతికే కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో ఇచ్చిన విధంగానే పోరస్ ప్రమాదంలో చనిపోయినవారికీ రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని.. ఒక్కో ప్రమాదానికి ఒక్కో తరహా పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించకూడదని డిమాండ్‌ చేశారు.

ఈ ఘటనలో మరో 13మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారని…వీరికి మెరుగైన వైద్యం అందించి న్యాయబద్ధంగా పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. రసాయన కర్మాగారాల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయని… భద్రత ప్రమాణాల నిర్వహణపై అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ప్రమాదాల నివారణకు కఠిన నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news