జనసేన అధినేత పనవ్ కళ్యాణ్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి తీసుకోవడానికి తాను సిద్దంగా ఉన్నానని.. ప్రజల మద్దతు పూర్తిగా ఉంటే ఓకే అన్నారు. తాను సున్నితంగా కనిపించవచ్చు కానీ ప్రజల కోసం వ్యక్తిగత దూషణలను భరించడానికి సిద్దమని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. ప్రధానంగా పొత్తులపై చర్చలు జరుగుతూ ఉన్నాయ్.
కొత్త ప్రభుత్వం జనసేన-బీజేపీ నాలేక.. జన సేన-టీడీపీ-బీజేపీ ప్రభుత్వ మా ? ఏదైనా సరే ప్రస్తుత ప్రభుత్వాన్ని మార్చే విధంగా పొత్తులు ఉంటాయని చెప్పారు. భవిష్యత్ లో ఎన్డీఏ ఎలా ఉంటుందన్నది కాలమే నిర్ణయిస్తుంది అని పేర్కొన్నారు. ఎన్నికలు అయ్యాక శాసనసభ్యుల నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి నిర్ణయం ఉంటుంది. ఈ ప్రాసెస్ లో ఓటు చీలకూడదన్నది నా ఉద్దేశం అన్నారు పవన్. ముఖ్యంగా టీడీపీ హయాంలో తప్పులు జరిగి ఉంటే చక్కదిద్దాలిసిన బాధ్యత ప్రభుత్వానిదే. జనసేన సంస్థాగత నిర్మాణం బలహీనంగా ఉందని చెప్పడానికి వాళ్ళేవరు. స్టీల్ ప్లాంట్ పై నిరంతరం ఒత్తిడితో సమస్యకు పరిష్కారం లభిస్తుంది అన్నారు.