ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. చిత్తూరు విజయ డైరీ కి 12 కోట్లు బకాయిలు ఉన్నాయి వాటిని త్వరలో చెల్లిస్తామని.. జూలై 4వ తేదీ సిఎం జగన్మోహన్ రెడ్డి విజయ డైరీని అంకితం చేస్తారన్నారు. అమూల్ సంస్థకు విజయ డైరీని అప్పగించడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని వెల్లడించారు. ఇప్పటికే పాడి రైతులకు ఐదు నుంచి పది రూపాయలు పెరిగాయని.. అమూల్ రాకతో చిత్తూరు జిల్లాతో పాటు పక్క జిల్లా పాడిరైతులకు లీటర్ కు పది రూపాయలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
ఎన్నికలలో ఇచ్చిన హామీలను సిఎం జగన్ నెరవేరుస్తున్నారన్నారు. జూన్ నెలలో 260 మిలియన్.యునిట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ వినియోగం జరిగింది.. డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ అందించిన ఘనత జగన్ ప్రభుత్వానిదని వెల్లడించారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మరని… షుగర్ ఫ్యాక్టరీ సమర్థవంతంగా నిర్వహించలేనప్పుడు ఆ స్థానంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సిఎం హామీ ఇచ్చారన్నారు. సిఎం జగన్ హామీ మేరకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని.. షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగుల కోసం 32 కోట్ల బకాయిలు త్వరలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు.