పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం మరో రూ. 826 కోట్లను విడుదల చేసింది. ప్రాజెక్టు కోసం రాష్ట్రం చేసిన ఖర్చులకు గాను ఈ నిధులను రీయింబర్స్ చేసింది. 2014, ఏప్రిల్-1 తర్వాత ప్రాజెక్టు పనులకు రాష్ట్రం రూ. 16,045 కోట్లు ఖర్చు చేయగా.. కేంద్రం ఇప్పటివరకు రూ. 14,289 కోట్లను విడుదల చేసింది.
ఇంకా గత బకాయిలతో కలిపి రూ.1,755 కోట్లను కేంద్రం చెల్లించాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే.. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్లని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది కేంద్ర సర్కార్. లిఖితపూర్వక సమాధానమిచ్చారు కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్.