టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ ఈనెల 27వ తేదీ నుంచి యువగళం పేరుతో పాదయాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాదయాత్రికి ఇప్పటివరకు పోలీసు శాఖ నుంచి ఎటువంటి అనుమతి రాకపోవడంతో టిడిపి శ్రేణులలో ఒక ఇంత ఆందోళన నెలకొంది. అయితే తాజాగా లోకేష్ పాదయాత్రకి అనుమతి ఇస్తూ పోలీసు శాఖ ఆదేశాలు ఇచ్చింది.
కానీ కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది పోలీస్ శాఖ. నిబంధనలకు లోబడి పాదయాత్ర జరగాలని స్పష్టం చేసింది. పాదయాత్రలో ఎక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు పోలీసులు. ఈనెల 27వ తేదీన ఉదయం 11 గంటలకు కుప్పంలో నారా లోకేష్ యాత్ర మొదలవుతుంది. 400 రోజులపాటు 4000 కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగింది. 100 నియోజకవర్గాలలో ఈ పాదయాత్ర సాగనుంది.