వచ్చే నెలలో బందరు పోర్టు పనులు ప్రారంభం

-

బందరు ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న పోర్టు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. మే మూడో వారంలో పనులు ప్రారంభించి మూడేళ్లలో పూర్తి చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రూపొందించింది.

4 నెలల క్రితమే బందరు పోర్టు నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతుల్ని మంజూరు చేసింది. మార్చి నెలలోనే పనులు ప్రారంభించాలని భావించినప్పటికీ వివిధ కారణాలవల్ల ఆలస్యం అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news